సీఎం జగన్ రెండో విడత ఆసరాకు శ్రీకారం!
1 min readపల్లెవెలుగువెబ్, ఒంగోలు: రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ గురువారం ఒంగోల్లో ప్రారంభించారు. ఒంగోల్ నగరంలోని పివీఆర్బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రెండో విడత ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ఈనెల 18వ తేదీ దాకా కొనసాగుతుంది. మహిళా లబ్దిదారు ఖాతాల్లో ఆసరా సొమ్ము జమచేయనున్నట్లు ప్రకటించారు. అయితే బద్వేల్ ఉప ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండే క్రమంలో తిరిగి నవంబర్ 6నుంచి 15వరకు ఆసరా కార్యక్రకమాన్ని కొనసాగిస్తామన్నారు. మహిళలకు సుస్థిర ఆదాయం కల్పించాలన్న లక్ష్యంతో ఆసరాను తీసుకొచ్చామన్నారు. రెండో విడత ఆసరా కింద రూ.6,439కోట్లను పొదుపు మహిళల ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 7.97లక్షల పొదుపుసంఘాల్లోని 78.79లక్షల మంది పొదుపు మహిళకు 2019 ఏప్రిల్ దాకా చెల్లించాల్సిన రూ.25,517కోట్ల రుణాలను నాలుగు విడతల్లో ప్రభుత్వం చెల్లించే ఆసరాగా నిలిచేందుకు సంకల్పించదన్నారు. ఈ క్రమంలో రెండో విడతగా రూ.6,439కోట్లను అక్టోబరు, నవంబరు నెలల్లో మహిళల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. సున్నా వడ్డీ పథకం ద్వారా 95 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. మహిళలకు సాంకేతికత, బ్యాంకింగ్ రంగాల్లో శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించాం. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నాం. ప్రభుత్వ చొరవతో 3 లక్షలకుపైగా మహిళలు వివిధ వ్యాపారాలు ప్రారంభించారు. నెలకు రూ.7వేల నుంచి రూ.10వేలకుపైగా అదనపు ఆదాయం పొందుతున్నారు. హోంమంత్రిగా తొలిసారి మహిళకు అవకాశం ఇచ్చాం. జగనన్న కాలనీల ద్వారా 1.25 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. రాష్ట్రంలో 67.47 శాతం పదవులు మహిళలకు కేటాయించాం. రాష్ట్రంలో రూ.1450 కోట్లు ఖర్చుచేసి 61 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని’’ సీఎం అన్నారు.