NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాలకుర్తి వాసికి.. సీఎంఆర్​ ఎఫ్​ మంజూరు

1 min read

లక్ష రూపాయల చెక్కు అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

కోడుమూరు, న్యూస్​ నేడు :కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన సానియా తండ్రి మునీర్ కి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోడుమూరు ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి  రూ.1,08968 రూపాయల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సానియా తండ్రి మునీర్​ మాట్లాడుతూ  తమ ఆర్థిక  పరిస్థితి బాలేక హాస్పిటల్ లో అప్పు చేసి ట్రీట్మెంట్ తీసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆర్థిక పరిస్థితిని  ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి  దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి సీఎం రిలీఫ్​ ఫండ్​ కు దరఖాస్తు చేసుకోవాలని విన్నవించారు. ఎమ్మెల్యే సూచనతో సీఎం రిలీఫ్​ ఫండ్​కు దరఖాస్తు చేసుకోగా మాకు లక్ష ఎనిమిది వేల తొమ్మిది అరవై ఎనిమిది రూపాయలు చెక్కు మంజూరైందని, ఆ చెక్కును ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అందజేసినట్లు బాధితులు మునీర్​ వెల్లడించారు.   తమకు సహాయం చేసిన ఎంఎల్ఏ బొగ్గుల దస్తరి ,  సిఎం చంద్రబాబు నాయుడు,  తెలుగుదేశం సీనియర్​ నాయకులు  విష్ణువర్థన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *