ప్రజా సంక్షేమానికి కట్టుబడి సీఎం పాలన కొనసాగుతుంది
1 min read– 13వ డివిజన్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం..
– ప్రజా సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది..
– మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 13 వ డివిజన్ ఇందిరా కాలనీ వెంకన్న చెరువు దగ్గర నుండి 13వ డివిజన్ కార్పొరేటర్ నిడికొండ అన్నపూర్ణ నరేంద్ర ఆద్వర్యంలో మన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆళ్ళ నాని గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం పాదయాత్రలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. జగనన్న అందిస్తున్న పథకాలను లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో అందుతున్న విధానాన్ని మహిళలను, విద్యార్థులను, వయోవృద్ధులను, ప్రత్యేక శ్రద్ధతో అడిగి తెలుసుకున్నారు. అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ మళ్ళీ జగనన్నే రావాలంటే నినాదాలతో మహిళలు పూల వర్షం కురిపించి ఆళ్ల నానికి ఘన స్వాగతం పలికారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ లు, ఈడా ఛైర్పర్సన్ , సాహిత్య అకాడమీ చైర్పర్సన్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ , డిప్యూటీ మేయర్లు మరియు వివిధ విభాగాల చైర్మన్స్ మరియు కార్పొరేటర్లు మరియు వివిధ విభాగాల అధ్యక్షులు మరియు కోఆప్షన్ సభ్యులు మరియు గుడి చైర్మన్స్ మరియు వివిధ విభాగాల డైరెక్టర్లు మరియు అన్ని డివిజన్ల పార్టీ నాయకులు మరియు ఏలూరు వైస్సార్సీపీ సిటీ కమిటీ నాయకులు మరియు అన్ని అనుబంధ విభాగాల నాయకులు మరియు సచివాలయం కన్వేనర్లు మరియు గృహ సారదులు, మరియు పార్టీ అభిమానులు, మున్సిపల్ కమిషనర్ ఎం ఆర్ ఓ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మరియు 13వ డివిజన్ ప్రజలు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.