NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇక పల్లెలకు రారండోయ్….

1 min read

ఓట్ల కోసం నాయకుల తిప్పలు

పల్లెల్లో హోరెత్తుతున్న మైకులు..ప్రచారాలు

నందికొట్కూరు న్యూస్ నేడు: స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామంలో భాగంగా ఇరుపార్టీల నాయకులు ఓట్లను రాబట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.నందికొట్కూరు మండలం రూరల్ మరియు మిడుతూరు మండలంలో ఎంపిటిసి,జడ్పిటిసి ఎన్నికలు ఈనెల 5వ తేదీ  జరగనున్నాయి.నందికొట్కూరు మండలం రూరల్ లో 11 ఎంపీటీసీ స్థానాలు..మిడుతూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు పార్టీల నుండి ఆసక్తి గల అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు.

పల్లెలకు రారండోయ్ అంటూ ఓట్లకు గాలం

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో  అభ్యర్థుల గెలుపు కోసం అధికార కూటమి ప్రభుత్వ నాయకులు మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఓట్లను రాబట్టుకునేందుకు ఓటర్లను కూల్ కూల్ చేస్తూ మా అభ్యర్థిని నిలబెట్టాం మా పార్టీకే ఓటు వేయుటకు మీరు గ్రామానికి వచ్చి ఓటు వేయాలని ఇతర గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న ఓటర్లకు నాయకులు గాళం వేస్తున్నారు.పల్లెల్లో పార్టీలకు చెందిన మైకులు హోరెత్తుతున్నాయి. ఎంపీటీసీ అభ్యర్థులు, నాయకులు జెడ్పిటిసి అభ్యర్థులు ఒక పార్టీని మించి మరొక పార్టీ అభ్యర్థులు ఓట్ల కోసం ప్రజల వద్దకు చొచ్చుకు వెళ్తున్నారు.

నేటి సాయంత్రం ప్రచారపర్వం మైకులు బంద్

ఈరోజు మంగళవారం సా ఐదు గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. పల్లెల్లో మోగనున్న మైకులు బంద్ కానున్నాయి.5వ తేదీన ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *