పన్ను బకాయిదారులకు కమిషనర్ లేఖ
1 min read
పన్ను బకాయిలపై 50% శాతం మాఫి సద్వినియోగపరచుకోండి
సచివాలయ సిబ్బందితో వాట్సాప్ ద్వారా చేరవేత
ప్రయోజనాలు పొందుతూ ఇంకా జాప్యాన్ని అంగీకరించలేం
చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సమయం ఆసన్నమైంది
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగరంలో ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ రుసుములను రాబట్టేందుకు వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్న కర్నూలు నగరపాలక సంస్థ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చేసిన జీవో 46 ఉత్తర్వుల మేరకు ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వినూత్నంగా బకాయిదారులకు సచివాలయ సిబ్బందితో వాట్సాప్ ద్వారా లేఖ పంపారు. కొన్నేళ్లుగా బకాయిలు చెల్లించాలని వివిధ రూపాల్లో కోరుతున్నప్పటికీ, కొంతమంది బకాయిదారులు మొండిగా వివరించడం అంగీకరించలేమని కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. చెత్త సేకరణ, వ్యర్థాల తొలగింపు, పూడికతీత పనులు, రహదారుల పరిశుభ్రత, శునకాల బెడద నియంత్రణ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రహదారుల నిర్వహణ, ఉద్యానవనాల నిర్వహణ, మురుగు కాలువల నిర్మాణాల అవసరం పౌరులకు ఎంతుందో, వీటి కోసం నిధులు సమకూర్చుకోవడం కూడా అంతే అవసరమని స్పష్టం చేశారు. మొండి బకాయిదారులపై తమకున్న విచక్షణ అధికారము ఉపయోగించి చట్ట ప్రకారంగా మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు సమయం ఆసన్నమైందన్నారు. తాగునీటి సరఫరా నిలిపివేయడం, షాపులు సీజ్ చేయడం వంటివి తప్పదని హెచ్చరించారు. ప్రయోజనాలు పొందుతూ పన్నులు చెల్లింపునకు జాప్యం చేయడం తగదని, సత్వరమే తమ పన్నులను చెల్లించాలని కమిషనర్ బకాయిదారులకు హితవు పలికారు.