గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న బ్లాక్ బౌండరీ లను త్వరితగతిన పూర్తి చేయండి
1 min read
సబ్ డివిజన్, ఎఫ్ లైన్ కి సంబంధించిన పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టండి
పైలెట్ ప్రాజెక్ట్ కింద రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న బ్లాక్ బౌండరీ లను పూర్తి చేయండి
సిసిఎల్ఎ జయలక్ష్మి
పల్లెవెలుగు, కర్నూలు: రీ సర్వే జరిగిన గ్రామాల్లో సబ్ డివిజన్, ఎఫ్ లైన్ కి సంబంధించిన పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సిసిఎల్ఎ జయలక్ష్మి అని జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు.బుధవారం విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లతో సిసిఎల్ఎ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిసిఎల్ఎ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్ట్ కింద రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న బ్లాక్ బౌండరీ లను త్వరితగతిన పూర్తి చేయాలని సిసిఎల్ఎ అని జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న రీ సర్వే గ్రామాలను సందర్శించి రీ సర్వే సిబ్బందికి పలు సూచనలు ఇవ్వాలని సిసిఎల్ఎ అని జిల్లాల కలెక్టర్ లకు సూచించారు.. రెవెన్యూ సదస్సులలో, గ్రామ సభలో వచ్చిన అర్జీలకు ఎండార్స్మెంట్ లు నాణ్యతతో ఉండే విధంగా చూసుకోండి.. ఎఫ్ పి ఓ ఎల్ ఆర్ మ్యుటేషన్ ఫామ్ 8 జనరేషన్ కి సంబంధించిన పురోగతి అంతగా లేదని పురగతి తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, సర్వే ఏడి మునికన్నన్ తదితరులు పాల్గొన్నారు.