NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అసెంబ్లీలో గంద‌ర‌గోళం.. గ‌వ‌ర్న‌ర్ గో బ్యాక్ నినాదాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజు వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభంకాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలైంది. కాగా… గవర్నర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.

                                    

About Author