జ్వాలాపురం శ్రీకాంత్‌కు అభినందన
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ ను దేవాదాయ శాఖలో గౌరవ సలహాదారునిగా నియమించినందుకు ఏపీ బ్రాహ్మణ అన్యాక్రాంతుల ఆస్తులు పరిరక్షణ కమిటీ చైర్మన్ సముద్రాల హనుమంతరావు , చెరువు వెంకట దుర్గాప్రసాద్, నాగవరపు రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచి గంటల శ్యాంసుందర్, మేఘన సుబ్రహ్మణ్యం సోమవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని అర్చకులకు, పురోహితులకు న్యాయం చేకూరుస్తారని, ధూప దీప నైవేద్యాల కింద నిధులు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారని అలాగే 13 జిల్లాల్లో ఉన్న చిన్నచిన్న దేవాలయం సమస్యలను పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఎండోమెంట్ పరిధిలో లేని దేవాలయాల్లో ఆదాయం ఉన్న లెక్కలు చూపకుండా నిబంధనలు లేని ట్రస్ట్ లను రద్దుచేసి దేవదాయ శాఖను అభివృద్ధి చేయాలని ఏపీ బ్రాహ్మణ అన్యాక్రాంతుల ఆస్తులు పరిరక్షణ కమిటీ కోరారు.