PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కౌశల్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  ఈనెల 14 ,15 తేదీలలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కౌశల్ పరీక్ష లో జిల్లాస్థాయి లో మొదటి ర్యాంకు సాధించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులను సోమవారం ఎంఈఓ గంగిరెడ్డి ప్రజా ప్రతినిధులు అభినందించారు, ఈ సందర్భంగా ఎంఈఓ గంగిరెడ్డి మాట్లాడుతూ, ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కౌశల్ పరీక్ష లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు మొదటి ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు, విద్యార్థినిలు ఇదే స్ఫూర్తితో, పట్టుదలతో మరింత ముందడుగు వేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ, మన విద్యార్థులు కౌశల్ పరీక్ష నందు జిల్లా మొదటి ర్యాంకు సాధించడం ఎంతో అభినందనీయమని తెలిపారు, విద్యార్థులు కృషి నాస్తి దుర్భిక్షం అనే విధంగా, తమ కృషితో పట్టుదలతో చదివి రాష్ట్రస్థాయిలో ఎంపిక అయి మొదటి ర్యాంకు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు, అనంతరం ఎంఈఓ-2 సునీత మాట్లాడుతూ, కౌశల్ పరీక్ష 8, 9, 10 విద్యార్థినులు జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడం పట్ల ఆమె విద్యార్థులను అభినందించడం జరిగింది, జిల్లా పరిషత్ పలికిలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్నా దేవి మాట్లాడుతూ, 8వ తరగతి నుండి నాగ తేజశ్రీ వర్మ, 9వ తరగతి నుండి వర్షిని, పదవ తరగతి నుండి నిర్మల టీమ్ పాల్గొనగా వీరికి కోఆర్డినేటర్ గా వీర శేఖర్ తమ సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు, తమ పాఠశాల విద్యార్థులు ఇంతటి ఘనతను సాధించడం అభినందనీయమని, అలాగే రాష్ట్రస్థాయిలో కూడా మరింత పట్టుదలతో ర్యాంకు సాధించాలని ఆమె కోరారు, ఈ కార్యక్రమంలో ఎంఆర్సి సిబ్బంది ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author