NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో ప్రాణదానం …

1 min read

మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

కర్నూలు, న్యూస్ ​నేడు:  కర్నూలు నగరంలో ఏర్పాటుచేసిన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరుకో ప్రాణాపాయం నుంచి కోలుకున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. టీజీ వెంకటేష్  జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రూపు రాజకీయాల వల్ల అభివృద్ధి బాగా కొంటుపడేదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడం వల్ల పనులు సక్రమంగా జరిగేవి కావన్నారు. ఎంతోమంది రోగులకు ఉపయోగపడే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కొరకు స్థల సేకరణకు ఎంతగానో అడ్డుకున్నారని, ఈరోజు అదే బెడ్ బ్యాంకు వల్ల సంవత్సరానికి పదివేల యూనిట్ల ఇవ్వగలుగుతున్నామని అన్నారు. దీని ద్వారా ఎంతోమంది రోగుల ప్రాణాపాయం తప్పుతుందన్నారు. అలాగే పంచలింగాల వద్ద రైల్వే  ప్రాజెక్టును అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సహకారంతో తీసుకురావడం జరిగిందని దానిని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారని అన్నారు.  అది ఇప్పుడు త్వరలోనే ప్రారంభం కానుందని టీజీ తెలిపారు. చిరంజీవి  బ్లడ్ బ్యాంకు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరిలో రక్తదానం పై మంచి అవగాహన కలిగిందన్నారు. అప్పటికంటే ముందే కర్నూల్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కర్నూలు రెడ్ క్రాస్ సొసైటీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, కేజీ గోవింద్ రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, శ్రీనివాస్, ఎస్కే మహేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author