కాంగ్రెస్ అగ్ర నేత శ్రీ రాహుల్ గాంధీ పోరాటంతోనే కులగనణ
1 min read
దేశవ్యాప్త కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంతోనే కేంద్ర ప్రభుత్వం తలొగ్గి కులగనన
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన అంశంపై కాంగ్రెస్ పార్టీ,మరియు పార్టీ అగ్రనాయకులు శ్రీరాహుల్ గాంధీజీ , పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం కులగణన అన్ని రాష్ట్రాల్లో చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎన్ ఎస్ యు ఐ. జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఈయన ప్రకటనలో శుక్రవారం న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం మరియు శ్రీ రాహుల్ గాంధీజీ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై కుల గణన అంశాన్ని గట్టిగా మాట్లాడి మరియు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీల నిర్ణయంతో తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి విజయం సాధించారని, దీనికి శ్రీరాహుల్ గాంధీజీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని , దేశవ్యాప్త ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పోరాడి విజయం సాధిస్తుందని తెలిపారు. దేశ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కులగనన్న మోడల్ అంశము ముందడుగులో ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇలాంటి పోరాటాలు అనేక పథకాలపై పోరాటాలుచేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.