వీధి వ్యాపారస్తులుగా నమోదు అవ్వండి
1 min read

నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు , న్యూస్ నేడు: నగరంలో వీధి వ్యాపారం చేసుకుంటున్న వారందరూ సంక్షేమ కార్యదర్శుల ద్వారా చేపట్టిన సర్వేలో నమోదు చేసుకోవాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వీధి వ్యాపారుల కోసం స్మార్ట్ స్ట్రీట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా వీధి వ్యాపారులను గుర్తించి, వారికి గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మంగళవారం నుండి ప్రారంభమైన ఈ సర్వే ఈ నెల 17 వరకు జరుగుతుందని, వీధి వ్యాపారులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం స్థానిక సచివాలయంలో సంక్షేమ కార్యదర్శిని సంప్రదించాలని కమిషనర్ వీధి వ్యాపారులకు సూచించారు.

