కోడుమూరు ఎస్సీ హాస్టల్ ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గత వారం కిందట కోడుమూరు ఎస్సీ హాస్టల్ విద్యార్థులపై విద్యార్థి దాడి చేసిన సంఘటనపై సోషల్ మీడియాలో నిన్న 24 /03/25వైరల్ కావడం జరిగింది. ఇది చూసిన వెంటనే వాస్తవాలు తెలుసుకొనుటకు కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనంతరత్నం మాదిగ వారితో పాటు మాజీ డివిఎంసి సభ్యులు W సత్య రాజు ఎద్దుల త్యాగరాజు రాజేష్ తిరుపాలు తదితరులు కలిసి కోడుమూరు ఎస్సీ హాస్టల్ ని ఈరోజు ఉదయం 11 గంటలకు సందర్శించి హాస్టల్ ఇన్చార్జి వార్డెన్ వలి విద్యార్థులతోని విద్యార్థుల తల్లిదండ్రులతోని మాట్లాడి నిజా నిజాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనంతరత్నం మాదిగ మాట్లాడుతూగతవారం కిందట కోడుమూరు ఎస్సీ హాస్టల్లో 10వ తరగతి విద్యార్థి మహేష్ ఎనిమిదో తరగతి విద్యార్థులు రాజు ఇస్సాకులను బెల్టు తోని కాళ్లతోని విచక్షణ రైతంగా దాడి చేయడం జరిగింది ఈ యొక్క దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడి వారం క్రిందట రాత్రి 9 30 నిమిషాలకు జరిగింది ఆ సమయంలో వార్డెన్ లేడు వాచ్మెన్ లేడు వీరి నిర్లక్ష్యం వలన పిల్లలు ఈ దాడి చేసుకోవడం జరిగింది. కావున దాడి చేసిన మహేష్ తో పాటు కేసులో మొదటి ముద్దాయిగా వార్డెన్ను వాచ్మెన్ చేర్చాలని జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లనందు ఇలాంటి దాడులు పునరా వృతం కాకుండా కలెక్టర్ గారు చొరవ తీసుకొని హాస్టల్ నందు కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని లేని పక్షంలో వార్డెన్లకు వసతిగృహం హాస్టల్లో నిర్మింప చేస్తే వార్డెన్ పిల్లల యోగక్షేమాలు చూసు కోవడానికి ఉంటుంది ఆయన మాట్లాడారు.