వేగవంతంగా తాగునీటి సంప్ నిర్మాణ పనులు
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న నీటి ఫిల్టర్ బెడ్ వద్ద కొత్తగా చేపడుతున్న తాగునీటి సంప్ నిర్మాణ పనులు వేగ వేగవంతంగా సాగుతున్నాయి. 2.5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల నీటి సంపును 19 లక్షల జిల్లా పరిషత్ నిధులతో తాగునీటి సంప్ ను నిర్మిస్తున్నట్లు జడ్పిటిసి బావ శేషప్ప మరియు ఎంపీపీ తనయుడు ఈసా తెలిపారు. నీటి సంప్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు తమవంతుగా కృషి చేస్తున్నామని అన్నారు. త్వరలోనే సంపు నిర్మాణ పనులను పూర్తిచేసే గ్రామ ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తామన్నారు. సంప్ నిర్మాణంతో మేజర్ గ్రామపంచాయతీలో తాగునీటి ఎద్దడి తగ్గుతుందని అన్నారు.

