NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ మినీ ఆర్టీసీ డిపోను పూర్తిస్థాయి డిపోగా మార్చండి

1 min read

కర్నూలు జిల్లా సబ్ కలెక్టర్ నవ్య కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు  

పల్లెవెలుగు, పత్తికొండ:  పత్తికొండ  రెవెన్యూ డివిజన్ కేంద్రంగా  ప్రస్తుతం ఉన్న  మినీ ఆర్టీసి డిపోను పూర్తిస్థాయి డిపోగా మారుస్తూ, ప్రజలకు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్‌తో శుక్రవారం స్థానిక ఆర్​అండ్​బి గెస్ట్ హౌస్ వద్ద సబ్ కలెక్టర్ నవ్య కి కు బిజెపి నియోజకవర్గ  కన్వీనర్ గోవర్ధన్ నాయుడు  నేతృత్వంలో బిజెపి నాయకుల బృందం కర్నూలు సబ్ కలెక్టర్ నవ్య కు వినతిపత్రం అందజేశారు.గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలు ఈ డిమాండ్ చేస్తూనే ఉన్నా, ఇప్పటికీ అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్నప్పటికీ ఆర్టీసి డిపో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడం ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి డిపో మేనేజర్ల పరిపాలన కారణంగా, ప్రజల సమస్యలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు. కావున ఇప్పటికైనా ఆర్టిసి డిపోను పూర్తిస్థాయి డిపోగా మార్చాలని,పత్తికొండ నుండి విజయవాడ, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని, డిపోలో పాత బస్సులను తొలగించి కొత్త బస్సులను వేయాలన్నారు. అలాగేఎక్స్‌ప్రెస్ బస్సులను నడిపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రస్తుతం నడుపుతున్న తిరుపతి,చెన్నయ్ బస్సు  సర్వీసు టైమింగ్ ను గతంలో ఉన్న సమయానికి మార్చాలని తెలిపారు.ప్రభుత్వం ప్రజల డిమాండ్‌ను వెంటనే పరిష్కరించి, పత్తికొండ ప్రజలకు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలను అందించాలని నాయకులు సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.

About Author