PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరోన వేళ.. పన్నులు పెంచడమా..!

1 min read

– పెంచిన పన్నులు తగ్గించండి.. చెత్త పన్ను రద్దు చేయండి
– బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కొండేపోగు చిన్న సుంకన్న
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కరోన విపత్కర కాలంలో ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పన్నులు పెంచడం ఏమిటని బీజేపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్​చార్జ్​ కొండేపోగు చిన్న సుంకన్న రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ లో పెంచిన పన్నులను తగ్గించాలని కోరుతూ బుధవారం నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సందర్భంగా చిన్న సుంకన్న మాట్లాడుతూ ఆస్తిపన్ను, ఇంటి పన్ను, అలాగే చెత్త పన్ను రూపంలో అధిక మోతాదులో పన్నులు విధించడం సరైనది కాదన్నారు. పెంచిన పన్నులు తగ్గిస్తూ.. చెత్త పన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ బేబీ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్ల దామోదర్ రెడ్డి ,బీజేవైఎం నాయకులు వెంకటేష్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author