ఆ దేశంలో కరోన నాలుగో వేవ్ !
1 min readపల్లెవెలుగ వెబ్ :దక్షిణాఫ్రికాలో కరోన కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదలతో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కోవిడ్ టెస్ట్ చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి కరోన పాజిటివ్ వస్తోంది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామసోఫా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో నాలుగో వేవ్ కూడ ఊహించిందేనని ఆయన అన్నారు. దక్షిణాఫ్రికాలో వారం క్రితం కరోన కేసుల సంఖ్య 2 శాతం ఉండగా.. ప్రస్తుతం 25 శాతానికి పెరిగింది. కోవిడ్ నాలుగో వేవ్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఇప్పటికే అంచనా వేశారని అధ్యక్షుడు సిరిల్ రామసోఫా తెలిపారు.