కర్నూలు జీజీహెచ్ ను.. కార్పొరేట్ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తా..
1 min read
పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీ.జీ భరత్
- రూ. 61 లక్షలతో 2డి ఎకో కలర్ డాప్లర్ మిషన్ ను ప్రారంభించిన మంత్రి
కర్నూలు : కర్నూలు ప్రభుత్వ సర్వజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగంల లో క్రొత్త 2డి ఎకో కలర్ డాప్లర్ మిషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి.భరత్ ప్రారంభించారు. రూ.61 లక్షలు విలువ చేసే 2డి ఎకో కలర్ డాప్లర్ మిషన్ గుండెకు సంబంధించిన సమస్యలను పసిగడుతుందని, ఇది పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం కార్డియాక్ క్యాత్ లాబ్ ను సందర్శించి అక్కడ ఉన్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మంత్రి మాట్లాడుతూ… ఈ 2డి ఎకో డాప్లర్ మిషన్ వలన ఒక నెల వయసు ఉన్న శిశువు గుండె సంబంధిత సమస్యలను కనుగొనే అవకాశం ఉంటుందని, దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. 2029 సంవత్సరానికి కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి టిజి భరత్ స్పష్టం చేశారు. ఈనెల 19వ తారీఖున ఆరోగ్యశాఖ మంత్రి కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శిస్తారని తెలియజేశారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో ఉన్న మిషన్ 15 సంవత్సరాల వయసు గల వారికి ఉపయోగపడేదని, ఈ మిషన్ నెలలోపు పిల్లల ను కూడా పరీక్షించడానికి ఉపయోగపడుతుందని , మంత్రిగారి సహకారంతో ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ మాట్లాడుతూ ఈ మిషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని గుండెలో వాల్వులు మార్చే దానికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేశారు. కార్డియాలజీ విభాగపు హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ మిషన్ మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా 61 లక్ష రూపాయల వెచ్చించి కొనడం జరిగిందని,దీని వలన చిన్నపిల్లల గుండె సంబంధిత అన్ని పరీక్షలు మనము ఇక్కడే చేసుకునే అవకాశం ఉంది అని తెలిపారు. ఈ సమావేశానికి ఆస్పత్రి సూపర్ మెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, కార్డియాలజీ విభాగ హెడ్,ప్రాఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, సహాయ ప్రొఫెసర్ డాక్టర్ లలిత కుమారి మరియు సంబంధిత డాక్టర్లు పాల్గొన్నారు.
