ఏసీబీ వలలో అవినీతి జలగలు..
1 min readపల్లెవెలుగువెబ్, ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో రెండు అవినీతి జలగలు ఏసీబీ వలకు చిక్కాయి. ఇంటి పన్ను చెల్లించుకోడానికి బిల్ కలెక్టర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రూ.8వేలు లంఛం ఇవ్వాలని డిమాండ్ చేయగా.. సదరు వ్యక్తినుంచి డబ్బులు తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు శుక్రవారం రెడ్ హెండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి మాట్లాడుతూ వేంపెంట గ్రామానికి చెందిన ఆనందరావు ఏరాసు అయ్యపు రెడ్డి కాలనీలోని తన ఇంటికి పన్ను కట్టించుకోవలసిందిగా గత కొద్ది రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే అదునుగా భావించిన బిల్ కలెక్టర్ లింగస్వామి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎల్లయ్య పని కావాలంటే రూ.8 వేలు లంఛం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై ఆనందరావు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఏ ప్రభుత్వ అధికారులు పనులు చేయకుండా కాలయాపన చేస్తూ లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ ని సంప్రదించాలని కోరారు. ఈ దాడులో ఏసీబి సిఐలు ఇంతియాజ్ భాష, కృష్ణారెడ్డి ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.