NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదింటి బిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆత్మకూరు: ‘మనం సంపాదించిన దాంట్లో.. కొంతైనా దానం చేసినప్పుడే జన్మ సార్థకం అవుతుంది..’ అని మనస్ఫూర్తిగా నమ్మి.. ఆచరిస్తున్నాడు ఆత్మకూరు ఆర్టీసీ ఏడీసీ షేక్షావలి. వెలుగోడు మండలం రేగడ గూడూరు గ్రామంలో గత కొన్ని సంవత్సరాల కిందటే తండ్రిని కోల్పోయి తల్లి కష్టం మీద బతుకుతున్న ఆడ కూతురి వివాహానికి చేతనైనంత ఆర్థిక సహాయం చేశాడు. ఈ సందర్భంగా షేక్షావలి మాట్లాడుతూ పేదింటి ఆడపిల్ల వివాహాలకు మనస్ఫూర్తిగా సహాయం చేస్తానన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉస్మాన్, ఏ. ఎమ్. ఉసేన్, మహబూబ్ వలి, ఆరిఫ్, రఫిక్,మాసుమ్ వలి సహాయ సహకారాలతోనే తాను ఆర్థిక సహాయం చేస్తున్నానని ఈ సందర్భంగా షేక్షావలి పేర్కొన్నారు.

About Author