జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం
1 min read
సమావేశంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం డీఎస్పీలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు
వివిధ ప్రాంతాలలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మహాశివరాత్రి పండగ నేపథ్యంలో పట్టిసీమ బలివే మరియు కలిదిండి ప్రాంతాలలో ఉన్న శివాలయాల వద్ద ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా ఉద్యోగ నిర్వహణ చేసినందుకు మరియు ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగ నిర్వహణ చేసిన అధికారులు అందరిని అభినందించిన జిల్లా ఎస్పీజిల్లాలో గత నెలలో నమోదు అయిన కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తు పురోగతిని విశ్లేషించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ నకు అందిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించి, సంబంధిత నివేదికను నిర్దేశిత గడువులో జిల్లా కార్యాలయానికి పంపించాలి.పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాపార సముదాయాలు, దేవాలయాలు, అపార్ట్మెంట్లు తదితర ప్రదేశాల సీసీటీవీ పర్యవేక్షణ ను కట్టుదిట్టంగా చేపట్టాలి.పోలీసులు ప్రతి గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా సందర్శించి, చిన్న సమస్యలనే తక్షణమే పరిష్కరించాలని,గ్రామాల్లో శాంతి కమిటీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి.ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్స్ వద్ద తగిన రక్షణ చర్యలు, ఇసుకతో నిండిన డ్రమ్ముల ఏర్పాటు, వేగ నియంత్రణ చర్యలను డ్రోన్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ వరకు అధికారులు చర్యలు తీసుకోవాలని.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టాలి.విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.విద్యా సంస్థలలో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, సోషల్ మీడియా ముప్పులు గురించి అవగాహన కల్పించా లన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు ఎవరైనా అవినీతి కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిస్సింగ్ కేసులు,174 CrPC కేసులపై త్వరితగతిన దర్యాప్తు చేసి పరిష్కరించా లన్నరు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచి, వారి జీవన విధానాన్ని పర్యవేక్షించారు. పేకాట, కోడి పందాల వంటి అసాంఘిక కార్యక్రమాలపై ముందస్తు చర్యలు తీసుకొని, సంబంధిత వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చికెన్ వ్యర్ధాల రవాణాను అరికట్టాలని చికెన్ వ్యర్ధాలు రవాణా చేసే వాహనాలను సీజ్ చేసి వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేయాలని తెలియ చేసినారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్.ఎస్.ఎస్. శేఖర్, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర, డి టి సి డిఎస్పీ ప్రసాదరావు అన్ని పోలీస్ స్టేషన్ ల సీఐలు, ఎస్‌ఐ లు పాల్గొన్నారు.