ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో క్రైమ్ రివ్యూ మీటింగ్
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి పి శ్రీదేవి జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఇందులో నాటుసారాయి సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 ను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు, పాత నేరస్తులను ఎంతమంది బైండోవర్లు చేశారు, ఎన్ని గ్రామాల్లో గ్రామస్థాయి కమిటీలు నిర్వహించారు అని రివ్యూ చేశారు అదేవిధంగా పొరుగు రాష్ట్రాల మద్యంను ప్రత్యేకంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల సుంకం చెల్లించని మధ్యం ను అరికట్టాలి అని తెలిపారు .ఈ రివ్యూ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీ రావిపాటి హనుమంతరావు కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ మచ్చ సుధీర్ బాబు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ డి రామకృష్ణారెడ్డి ట్రైనీ AES శ్రీ హర్ష యశస్కర్ మరియు కర్నూలు జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు అందరూ పాల్గొన్నారు.