భక్తులకు దర్శన ఏర్పాట్లు
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం నాలుగు క్యూలైన్ల ద్వారా దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాటు చేశారుఉచిత దర్శనం, శీఘ్రదర్శనం అతిశీఘ్రదర్శనం మరియు శివదీక్ష భక్తుల ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు పాదయాత్ర నుంచి వచ్చే భక్తులకు కూడా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడం దివ్యాంగులకు కూడా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయబడింది.ఉచిత దర్శన క్యూలైన్ రథశాల వద్ద నుండి ప్రారంభమవుతున్నది. అదేవిధంగా శీఘ్రదర్శనం,అతిశీఘ్రదర్శనం క్యూలైన్లు క్యాంప్ కోర్టు భవనం ముందు నుండి ప్రారంభమవుతున్నాయి. కాగా ఈ నెల 11వ తేదీ నుండి అన్ని ఆర్జితసేవలు నిలుపుదల చేయబడ్డాయి. 11వ తేదీ నుండి భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం కల్పించబడుతోంది.అయితే జ్యోతిర్ముడి ధరించిన శివదీక్షా భక్తులకు 15వ తేదీ వరకు నిర్ధిష్టవేళలలో శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతించడం జరిగింది. కాగా గతంలో వలనే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదినం రోజున ఉచిత దర్శనం పాసులు ఇవ్వబడవు. సర్వదర్శనం క్యూలైను భక్తులకు త్వరితదర్శనం కల్పించేందుకుగాను దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.