పాణ్యం అభివృద్ధికి..డిప్యూటీ సీఎం వరాల జల్లు
1 min read
నిధులు మంజూరు చేయాలని కోరిన పాణ్యం ఎమ్మెల్యే
నిధులు మంజూరు చేస్తూ పవన్ ఆదేశాలు జారీ..
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : పాణ్యం నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరాల జల్లు కురిపించారు. శనివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో నీటి కుంటల నిర్మాణ భూమి పూజ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి కి సభలో వివిధ రకాల అభివృద్ధి పనులు కావాలని ఉప ముఖ్యమంత్రిని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కోరారు.వెంటనే డిప్యూటీ సీఎం స్పందిస్తూ ఎమ్మెల్యే అడిగిన అభివృద్ధి పనులకు అన్నింటినీ మంజూరు చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గ్రావెల్ రోడ్లు,సిమెంట్ రోడ్లు,డ్రైనేజీ కాలువలు, ప్రభుత్వ పాఠశాలలు మరియు స్మశానాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషను డిప్యూటీ సీఎం ఆదేశించారు.అంతే కాకుండా ఓర్వకల్లు గుట్టపాడు,ఉప్పలపాడు వరకు బీటీ రోడ్డుకు 2 కోట్ల 26 లక్షల నిధులను వెంటనే మంజూరు చేస్తూ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఎన్ హెచ్- 7 జాతీయ రహదారి నుండి కల్లూరు వయా లక్ష్మీపురం-పెద్దపాడు వరకు రోడ్డుకు నిధులు మంజూరు చేశారు.రంజాన్ పండుగ ఉంది కాబట్టి ఉపాధి కూలీలు త్వరగా వచ్చేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడుతానని డిప్యూటీ సీఎం తెలిపారు.ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గోకులం షెడ్లు ఇంకా ఎక్కువగా మంజూరు చేయాలని పొలాల రస్తాలకు రోడ్లు వేసేందుకు ఉపాధి హామీ పథకంలో చేర్చాలని ఎమ్మెల్యే అన్నారు.సభలో జన సైనికు లు ఈలలు అరుపులతో సభ మార్మోగింది.డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్తుండగా పవన్ కు బాయ్ బాయ్ చెప్తూ యువకులు పరుగులు తీశారు.
