వృద్ధ మహిళలకు దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ
1 min read
హొళగుంద , న్యూస్ నేడు : మండల కేంద్రంలోని అనాధ వృధా మహిళలకు వికలాంగులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసినట్లు ఆదోని స్వామి వివేకానంద ట్రస్ట్ మరియు హెళగుంద భారత్ యూత్ అసోసి యేషన్ సభ్యులు తెలి పారు. ఈ సందర్భంగా సభ్యులు రవికాంత్, గాళప్ప తదితరులు మాట్లాడుతూ మండ లంలోని సుమారు పది మంది దాకా అనాధ వృద్ధ మహిళలకు వికలాంగులకు తమ వంతుగా సాయం అందించడం కోసం గత 38 నెలలుగా నిరాటంకంగా నిరంతరా యంగా వారికి నిత్యవసర సరుకులను పంపిణీ చేసి వారికి చేదోడు వాదోడుగా సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థనిర్వాహకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.