కాబోయే వధూవరులకు బంగారం పుస్తెలు, పట్టు వస్త్రాలు పంపిణీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని, మే 16 తేదీన వివాహం చేసుకుంటున్న జంటలకు ఈరోజు టీజీ స్వగృహంలో పట్టు వస్త్రాలు, కాళీ మెట్టెలు, బంగారు తాళిబొట్టు పంపిణీ చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం 75 జంటలు మే 16న వివాహంతో ఒక్కటి కానున్నారు. వీరందరికీ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సతీమణి శ్రీమతి శిల్పా భరత్, శ్రీమతి మౌర్య లు ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులకు పట్టి వస్త్రాలను పంపిణీ చేశారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మే 16న ఒక్కటయ్యే వారికి తమ కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు. ఈసారి వివాహం చేసుకున్న వారికి ఒక్కొక్క జంటకి తాళిబొట్టు, పట్టు వస్త్రాలతో పాటు 80 వేల రూపాయల నగదును కూడా అందజేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని టీజీ కుటుంబ సభ్యులు తెలిపారు.