అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పనిచేసే కార్మికులకు కిట్లు పంపిణీ
1 min read
కమిషనర్ ఏ.భాను ప్రతాప్, కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో పనిచేసే కార్మికులు అనారోగ్యానికి గురికాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే ఒంటి పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులను నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు,కమిషనర్ ఏ.భాను ప్రతాప్ కార్మికులకు అందజేశారు. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ ఛాంబర్లో బుధవారం కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు,కమిషనర్ ఏ.భాను ప్రతాప్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను శుభ్రపరిచే కార్మికులు 26 మందిఉన్నారన్నారు. వృత్తిపరంగా వారు చేసే పనులు కారణంగా వ్యాధులు,ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకనే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక్కొక్కరికి లీటర్ కొబ్బరి నూనె, 12-రిన్ సబ్బులు,12-డెట్టాల్ సబ్బులు,2 జతలు చెప్పులు,3-టవల్స్ ప్రభుత్వ పరంగా ఇస్తున్నామన్నారు.అంతేకాకుండా వీరికి ప్రతి నెల ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని రకాల చెకప్ లు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి.చంద్రయ్య,డి.ఈ రజాక్,ఏ.ఈ సాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సూపర్వైజర్ దాసు కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు,తంగెళ్ళ రాము,తదితరులు ఉన్నారు.