పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కు ల్యాప్ టాప్ ల పంపిణీ
1 min read
ఆధునిక సాంకేతికతతో న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం వినియోగించాలి
ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్ ఐపీఎస్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ అందజేత
న్యూస్ నేడు ఏలూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యాయ వ్యవస్థలో సమర్థవంతంగా వినియోగించేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పి పి) మరియు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు (ఏపీపీ) ల్యాప్‌టాప్‌లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినారు.ఏలూరు రేంజ్ ఐజీ జివిజి అశోక్ కుమార్ ఐపీఎస్, ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ తో కలిసి ఏలూరు రేంజ్ కార్యాలయము లో ఏలూరు జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న పీ.పీలు మరియు ఏ.పీ.పీలకు ల్యాప్‌టాప్‌లను అంద చేసినారు.ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూసాంకేతిక పరిజ్ఞానాన్ని తమ వృత్తిలో సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ రికార్డులు,కోర్టు ప్రాసెసింగ్ వంటి అంశాల్లో మరింత చురుకుదనం సాధించవచ్చు. కేసుల విచారణ వేగవంతమవడంతో పాటు, ముద్దాయిలకు శిక్షలు నిర్ధారించడంలో ఇదివరకు ఎదురయ్యే సవాళ్లు తగ్గుతాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.సుబ్బారావు (ఇన్‌చార్జి కోర్టు మానిటరింగ్ సెల్), పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.ఈ పంపిణీ ద్వారా న్యాయ విభాగం మరింత ప్రగతిశీలంగా పనిచేసే దిశగా ముందడుగు వేసిందని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ దశలవారీ చర్యలతో న్యాయ వ్యవస్థలో పారదర్శకత, వేగం, న్యాయ నిశ్చితి మరింత మెరుగవుతాయని విశ్వాసం వ్యక్తమైంది.
