NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“స్థిరమైన భవిష్యత్తుకు రోబోటిక్స్ 5.0

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో వారం రోజులపాటు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి  సమయంతో “మానవ రోబో సహకారం – స్థిరీకరించిన వ్యక్తిత్వ వికాసం ఇండస్ట్రీ 5.0” అను అంశంలో అధ్యాపకులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి  త్రిబుల్ ఐటీ డిఎం ప్రొఫెసర్ డాక్టర్ జై. కృష్ణయ్య మరియు డాక్టర్ జె. సుదర్శన్,చైర్మన్, IEEE రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సొసైటీ హైదరాబాద్ సెక్షన్ చాప్టర్ వారు కీనోట్ స్పీకర్స్ గా వ్యవహరించారు. వారి ప్రసంగంలో,రోబోట్‌లు మన దైనందిన జీవితంలో అనేక విధాలుగా సహాయపడతాయి. పునరావృతమయ్యే పనులను నిర్వహించడం, రవాణాను సులభతరం చేయడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు తమను తాము మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టడానికి వీలు కల్పించడం వంటివి చేస్తాయి. కనుక రోబో టెక్నాలజీ పైన అవగాహన మరియు పరిశోధన కార్యక్రమాలు ఎన్నో చేపట్టగలిగితే మనము రోబో టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకోగలమని తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కళాశాల డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎం.గిరిధర్ కుమార్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు అధ్యాపకులు పారిశ్రామక రంగంలో జరుగుతున్న అభివృద్ధిని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే తెలుసుకుంటారని వాటిని తమ పాఠ్యాంశంలో జోడించి చెప్పగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కన్వీనర్ డాక్టర్ బి మధుసూదన్ రెడ్డి తన ఉపన్యాసంలో 50 మంది అధ్యాపకులు ఈ కార్యక్రమంలో రిజిస్టర్ అయ్యారని ఈ కార్యక్రమం విజయం విజయవంతం కాగలదెన ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల నుండి అధ్యాపకులు పాల్గొన్నారు.

About Author