వేసవి శిక్షణ శిబిరంలో క్రీడా దుస్తులు పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో.స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించే వేసవి శిక్షణ శిబిరం నందు ఎన్నుకోబడిన సెయింట్ జోసెఫ్ స్కూల్ క్రీడా మైదానం నందు అథ్లెటిక్స్, యోగ , కబడ్డీ, వాలీబాల్, మొదలగు క్రీడలు విద్యార్థులు వివిధ స్కూల్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నైపుణ్యం ప్రదర్శిస్తున్న విద్యార్థి విద్యార్థులకు బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి స్వగృహం నందు వారి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి తన సొంత ఖర్చులతో విద్యార్థి విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులు,PET ఉపాధ్యాయులు బీసీ ఇందిరా రెడ్డి సన్మానించడం జరిగింది.అనంతరం బిసి ఇందిరా రెడ్డి మాట్లాడుతూక్రీడల వల్ల శారీరక మానసిక ఉత్సాహం మరియు ఆరోగ్యం నిలకడగా ఉంటుందని గుర్తు చేశారు , అలాగే జాతీయ , రాష్ట్రీయ స్థాయిలో రాణించి మన నియోజకవర్గానికి తల్లిదండ్రులకి గురువులకి మంచి పేరు తేవాలని తెలియజేశారు , అలాగే బాక్సింగ్ మరియు కరాటే లో అమ్మాయిలు మెరుగుపడాలని సూచించారు, క్రీడా పరంగా చదువు పరంగా ఏం అవసరం వచ్చినా నేను ఉంటాను అని భరోసా ఇచ్చి విద్యార్థి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాట్రేడ్డి మల్లికార్జున్ రెడ్డి, Coach’s, యోగా టీచర్ విద్యక , హర్ష , చౌడయ్య , రామయ్య , రమేష్ విద్యార్థి విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.