సర్ఫ్ సీఈఓ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న జిల్లా కలెక్టర్
1 min read
కె.వెట్రిసెల్వి జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధి పరిశీలన
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్ర సెర్ప్ సీఈఓ కరుణ వాకాటి ఏలూరు జిల్లాలో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధిని పరిశీలించేందుకు మంగళవారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు స్థానిక రెవిన్యూ అతిధి గృహానికి చేరుకున్న కరుణ వాకాటి ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పూలమొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అందిస్తున్న రుణాలు, వాటిని వారు ఏ విధంగా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్న విషయాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ని కరుణ వాకాటి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకుని అభివృద్ధి పధంలో వెళుతున్నారని, రుణాల రికవరీ కూడా 99 శాతానికి పైగా ఉందని, బ్యాంకులు కూడా డ్వాక్రా సంఘాలకు రుణాలు అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.