జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం
1 min read
జిల్లాలో మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించండి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో ఉన్న చిన్ననీటిపారుదల చెరువులకు సంబంధించి మరమ్మత్తులు, తదితర పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వాటర్ బాడీస్ కు సంబంధించిన రిపేర్, రెనొనోవేషన్, రెస్టోరేషన్ (ఆర్ ఆర్ ఆర్) స్కీం జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ స్కీం కింద చిన్న నీటి పారుదల చెరువులకు మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు.. ఆర్ఆర్ఆర్ స్కీం ద్వారా కేంద్రం నుండి 60 శాతం, రాష్ట్రం నుండి 40 శాతం నిధులతో ఈ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.. ఇందుకు సంబంధించి జిల్లాలో ఉన్న చిన్న నీటి పారుదల చెరువులకు మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు తగిన అంచనాలను రూపొందించాలని కలెక్టర్ జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు.సమావేశంలో జలవనరుల శాఖ ఎస్ ఈ బాలచంద్రారెడ్డి, ఎమ్ఐ వర్క్స్ డివిజన్ ఈఈ శ్రీనివాసులు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ నాగేశ్వరరావు, గ్రౌండ్ వాటర్ డిడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
