డిఎస్సీ ఉద్యోగ నియామకాలలో మా జాతికి న్యాయం చేయండి..
1 min read
తూర్పాటి మనోహర్ “
కర్నూలు, న్యూస్ నేడు: ఎన్నో ఏళ్లుగా ఎలాంటి గుర్తింపు, కుల ధ్రువీకరణ పత్రాలు లేక ఉద్యోగ నియామకాలలో అన్యాయం జరుగుతుందని, బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ అన్నారు. ఈ డిఎస్సీ నోటిఫికేషన్ లో బేడ బుడగ జంగం కులాన్ని ఆన్లైన్లో నమోదు చెయ్యాలని కలెక్టర్రంజిత్ బాషా కి, జాయింట్ కలెక్టర్ బి నవ్య మేడం కి వినతి పత్రాన్ని కలెక్టరేట్లో జరిగిన ఈ పిజీఆర్ఎస్ కార్యక్రమం ఇవ్వడం జరిగినది.ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ, క్యాబినెట్ నందు బేడ బుడగ జంగం కులమును ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏ గ్రూపు చేరుస్తూ తీర్మానం చేయడం ఆ యొక్క నివేదికను కేంద్రమునకు పంపడం జరిగినదని వీటికి మేము సంతోషిస్తున్నాం.కావున ఇప్పుడు బేడ బుడగ జంగం కులము రెవెన్యూ ఆన్లైన్ నందు ఏ రిజర్వేషన్ లో పొందపరచలేదు, వీటి వల్లనే డీఎస్సీ నోటిఫికేషన్ నందు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే, మా కులమును నమోదు చేయాలని కోరుతూ తూర్పాటి మనోహర్ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంక్షేమ సంఘం, సిరివాటి గిరిధర్, కోమరి జయరాముడు పాల్గొని వినతి పత్రాన్ని ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఇవ్వడం జరిగింది.