ఆయనతో కన్నీళ్లు పెట్టించవద్దు : నాగబాబు
1 min read
పల్లెవెలుగు వెబ్: రాజకీయాల్లో విమర్శలు ఉండాలే తప్ప.. వ్యక్తిగత దూషణలు ఉండరాదని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల పై ఆయన స్పందించారు. వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండించారు. ఇలాంటి చెత్త సంప్రదాయానికి ముగింపు పలకాలని కోరారు. చంద్రబాబు నాయుడు తొలిసారి ఇలా భావోద్వేగానికి గురికావడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. కుటుంబ సభ్యులను విమర్శిస్తే ఎంత బాధగా ఉంటుందో తమకు తెలుసని అన్నారు. చంద్రబాబు వయసులో పెద్ద వ్యక్తి, ఆయనతో కన్నీళ్లు పెట్టించవద్దని అన్నారు.
Yoast SEO