`ఆడపడుచుల గురించి మాట్లాడటం.. అరాచక పాలనకు నాంది`
1 min read

పల్లెవెలుగు వెబ్: ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం సరైంది కాదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం అరాచకపాలనకు నాంది అని అన్నారు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన తన మనసును కలచి వేసిందని చెప్పారు. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి అని అన్నారు. తాను వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా మాట్లాడుతున్నానని తెలిపారు. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండని హితవుపలికారు. చేతనైతే ప్రజాసమస్యలు పరిష్కరించండని అన్నారు. ట్విట్టర్ వేదిక గా ఎన్టీఆర్ వీడియోను షేర్ చేశారు. చంద్రబాబు కుటుంబం పై వైసీపీ నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబం మొత్తం ముక్తకంఠంగా ఖండించింది. తమ కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చింది.

