PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా చిన్న ఏజ్‌లోనే వెండితెర ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ గా దూసుకుపోతున్నారు. నందమూరి హీరోల్లో అత్య‌ధిక ఫాలోయింగ్‌, మార్కెట్ ఉన్న హీరో ఎవరంటే జూనియ‌ర్ ఎన్టీఆరే అన్న విష‌యంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అయితే ఇప్ప‌టికే జూనియర్ 29 సినిమాలు చేశారు. ఎన్టీఆర్ డైరెక్షన్ లో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే హిందీ సినిమాలో నటించారు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో నటించారు. ఇప్ప‌టికే ఆయ‌న 29 సినిమాలు చేశారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. సినిమాల్లో నటిస్తూనే.. ఎన్టీఆర్ భారీగా ఆస్తులు సంపాదించారు. ఎన్టీఆర్ ఆస్తి 440 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రెమ్యునరేషన్‌తో పాటు సినిమాల లాభాల వాటాను కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక బ్రాండ్ అంబాసిడర్‌గా యాడ్ల కోసం కూడా ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని తీసుకుంటారు అని స‌మాచారం.

                                      

About Author