సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే ఆశ్రమాలను ఆలయాలను కూల్చడమేనా
1 min read
జ్యోతి క్షేత్రంలో కాశిరెడ్డి నాయన ఆశ్రమాలను కూల్చివేయడం అరాచకం
తెలుగు నాడు ప్రజా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ రాష్ట్ర నాయకుడు సత్య సాయినాథ్ శర్మ ఆగ్రహం
కమలాపురం, న్యూస్ నేడు: సనాతన ధర్మమంటే ఆలయాలను ఆశ్రమాలను కూల్చడమేనా… ఇదేనా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సనాతన ధర్మ న్యాయమని అని తెలుగు నాడు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ రాష్ట్ర నాయకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అనాధలను చేరదీస్తూ ఆకలి కోన్న వారికి అన్నం పెడుతున్న కాశీ నాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో కాశీ నాయన ఆశ్రమ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడం తీవ్రమైన అరాచకమని కమలాపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు గత అనేక సంవత్సరాలుగా కాశీ నాయన మండలంలో జ్యోతి క్షేత్రం అనేకమంది అనాధలకు ఆకలిగొన్న వారికి ఆపన్న హస్తంగా ఉందన్నారు. జ్యోతి క్షేత్రంలోని కాశీ నాయన ఆశ్రమంలో దిక్కులేని నిరుపేదలకు అనాధలకు ఆశ్రయం కోసం నిర్మించిన తాత్కాలిక షెడ్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు తో కూల్చివేయడం చాలా దారుణమైన సంఘటన గా ఆయన పేర్కొన్నారు. జ్యోతి క్షేత్రంలో కాశీ నాయన సేవకులు ఎవరు వ్యాపారం చేయడం లేదని సేవా భావంతో పనిచేస్తున్న ఆశ్రమ నిర్మాణాలను కూల్చివేయడం ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా నిరుపేదల ఆకలి శాపం తగులుతుందన్నారు. సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మిక భావనపై అత్యంత శ్రద్ధ చూపుతున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకోవడం, చాలా విచారకరమన్నారు. కాశీ నాయన ఆశ్రమం వల్ల అక్కడ అటవీ సంపదకు అటవీ సంరక్షణకు ఎటువంటి ఇబ్బందులు లేవని, గత రెండు దశాబ్దాలుగా నిరంతరం అన్నదానం జరుగుతున్న గొప్ప పుణ్యస్థలంగా జ్యోతి క్షేత్రం వర్ధిల్లుతోందన్నారు. ఇటువంటి మానవతా విచక్షణ కూడా లేకుండా ఫారెస్ట్ అధికారులు అక్కడి తాత్కాలిక రేకు ల షెడ్లను నిర్మాణాలను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం అనేది ఆధ్యాత్మిక సమాజానికి తీరని కళంకమన్నారు. కాశీ నాయన సమాధి పొందిన జ్యోతి క్షేత్రం వల్లనే ఆ మండలానికి కాశీ నాయన పేరు పెట్టారని గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో గౌరవించిన కాశీనాయన ఆశ్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కూల్చివేయడం చూస్తే జ్యోతి క్షేత్రంలో నిరుపేదలకు ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేనట్లు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలలో అన్నా క్యాంటీన్లు నిర్మించి ఐదు రూపాయలకు ఆహారం పంపిణీ చేస్తూ ఉంటే కాశీ నాయన ఆశ్రమంలో ఒక రూపాయి డబ్బు కూడా తీసుకోకుండా సేవా దృక్పథంతో చేస్తున్న విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చలేదేమో అని ఆయన ఎద్దేవా చేశారు. కాశిరెడ్డి నాయన గురించి గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎంతో మంచిగా మాట్లాడారని అయితే ఇప్పుడు ఆయన ఆశ్రమాలను కూల్చివేయడం లో ఉన్న మతలబు ఏమిటో ఈ ప్రభుత్వానికే తెలియాలన్నారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన జ్యోతి క్షేత్రంలోని కాశీ రెడ్డి నాయన ఆశ్రమ నిర్మాణ భవనాలను కూల్చివేయడం ముఖ్యమంత్రి కి ఉపముఖ్యమంత్రి కి తెలియకుండా జరిగే విషయం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే ఈ కూల్చి జరిగాయని తాము భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు కాశీ నాయన జ్యోతి క్షేత్ర ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు వివరించి జ్యోతి క్షేత్రంలో క్షమాపణ చెప్పి మరలా కూల్చివేసిన నిర్మాణాలను యధావిదంగా నిర్మింపజేసి జ్యోతి క్షేత్ర విశిష్టతను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.