వితండవాదం వద్దు.. జగన్ కు నారాయణ సూచన !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ వితండవాదానికి పోకుండా, హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ఒక వైపుఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు రాజధాని విషయం న్యాయ వ్యవస్థకు పోయింది. చివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా గత ప్రభుత్వం చేసిన అగ్రిమెంటు చెల్లుతుందని తీర్పునిచ్చింది. దాని ప్రకారమే అక్కడి అభివృద్ధి పనులు చేపట్టాలని, రైతులకు న్యాయంగా కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం దీనిని స్పోర్టివ్‌గా తీసుకోవాలని, వితండ వాదానికి పోకుండా హైకోర్టు తీర్పును శిరసావహించి, అమలు చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా కాలయాపన చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నా.
అని నారాయణ పేర్కొన్నారు.