జిల్లాకోర్ట్ లో డా:బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు
1 min read
భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన మహనీయులు డాక్టర్ బాబు జగజీవన్ రావు
ఏలూరు జిల్లా జడ్జి సునీల్ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా కోర్టు నందు భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 117 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయని జిల్లా బార్ అధ్యక్షులు కోనేరు సీతారాం తెలిపారు. ఏలూరు జిల్లా జడ్జి సునీల్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు సంఘసంస్కర్ణకర్తగా తన పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చిన బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ని కొనియాడారు. అదే విధంగా 27 సంవత్సరాలకే శాసనమండలికి ఎన్నికయి దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా వ్యవసాయ శాఖ, రైల్వే ,సివిల్ సప్లై మంత్రిగా పనిచేసే 52 ఏళ్ళు పార్లమెంటు సభ్యునిగా ఎన్ని క అనంతరం భారతదేశానికి ఎన్నో సేవలందించిన మహానుభావులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త జిల్ల జడ్జ్ చేతుల మీదుగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు బ్రీఫ్ హిస్టరీ పుస్తకాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రత్న ప్రసాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ,నోముల రాముడు బార్ జాయింట్ సెక్రెటరీ, రత్నరాజు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్, అభినేని విజయ్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కానాల రామకృష్ణ సీనియర్ న్యాయవాది,మద్దాల గోపాల్ మట్ట గొల్లపల్లి మురళి మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు.