NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

1 min read

కర్నూలు నగరంలో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీ.జీ. భరత్

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా కర్నూలు నగరంలో  క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ పేర్కొన్నారు.శనివారం కర్నూలు మండలం మునగాలపాడు గ్రామం బాల సాయిబాబా  స్కూల్ పక్కన ఉన్న  ఏసీఏ క్రికెట్ గ్రౌండ్ ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్,  విజయవాడ ఎంపీ మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రౌండ్ విస్తీర్ణం ఎంత ఉంది,లెవెలింగ్ పనులు, ఫెన్సింగ్  పనుల పురోగతి గురించి   మంత్రి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు..మంచి ఆర్కిటెక్ట్ తో, అవసరమైన  సౌకర్యాలతో, మంచి డిజైన్ లతో స్టేడియంను అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఏ సి ఏ  ప్రతినిధులకు సూచించారు.విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గ్రౌండ్  ప్రణాళిక ను జూన్ 7 వ తేది నాటికి రూపొందించాలన్నారు…అనంతరం అభివృద్ది పనులు ప్రారంభించి, త్వరితగతిన గ్రౌండ్ నిర్మాణం  పూర్తి అయ్యే విధంగా చర్యలు   తీసుకుంటామన్నారు.జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ గ్రౌండ్ ను రోవర్ తో సర్వే చేయించి నివేదికను రేపటి లోపు ఇవ్వాలని కలెక్టర్ కర్నూలు మండలం తహశీల్దారు ను ఆదేశించారు.అనంతరం  మంత్రి, కలెక్టర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించారు.. ట్యాంక్ ఎదురుగా ఉన్న భూమిని  ఆక్రమణకు గురి  కాకుండా  చూసుకోవాలని మంత్రి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు..ఆ భూమిని ఎకో పార్క్ లా అభివృద్ధి  చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి దండుమూడి శ్రీనివాస్, కర్నూల్ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూల్ ఆర్డీవో సందీప్, కర్నూలు మండల తహసిల్దార్ రమేష్ బాబు, కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author