జి.పుల్లారెడ్డి దంత వైద్య కళాశాలను సందర్శించిన డా. ఎన్టీఆర్ యూనివర్సిటి వీసి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, మాట్లాడుతూ జి.పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల , కర్నూలు పర్యటనలో భాగంగా ఈరోజు కర్నూలు పట్టణంలోని ప్రముఖ జి.పుల్లారెడ్డి దంత వైద్య కళాశాలను సందర్శించిన అనంతరం కీ.శే.జి.పుల్లారెడ్డి చిత్రపటానికి పూల మాలతో నివాళులర్పించారు. వారి అడుగు జాడలలో నడుస్తూ కాలేజిని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని వారినీ అభినందించారు.జి.నారాయణమ్మ పుల్లారెడ్డి అడిటోరియం నందు జరిగిన ఉపాధ్యాయ మరియు విధ్యార్థులతో ముఖాముఖి కార్యక్రమoలో కాలేజి యందు దంత వైద్య పరికరాలు మరియు మౌలిక సదుపాయాలు, వీటితో పాటు అనుభవజ్ఞులైన భోదన సిబ్బంది వుండటం చాలా సంతోషకరమని అన్నారు.కాలేజికి సంబందించిన ఏ విషయంలోనైనా నా దృష్టికి తీసుకవచ్చినట్లయితే వెంటనే స్పందించి తగు నిర్ణయం తీసుకుంటానని అన్నారు.ప్రతి సంవత్సరము ప్రతిభ కనబరిచిన కాలేజ్ కి బెస్ట్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ అవార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ట్రైనింగ్ మీద ఆసక్తి ఉన్న సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ ని ప్రోత్సహిస్తూ వారి సేవలను ఉపయోగించుకోవడానికి అనే సాకర్యం తీసుకొచ్చామని తెలియజేశారు.డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ కి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమములో భోదన సిబ్బంది, మరి విద్యార్థులతో పాటు భోధనేతర సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి జి. పుల్ల రెడ్డి డెంటల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్, వై.మురళీధర్ రెడ్డి, డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్, డా.ఎస్.నాగలక్ష్మి రెడ్డి, ప్రొఫెసర్ & హెచ్ ఓ డి ఆర్థో డాంటిక్స్, డా. ఎం.భారతి, ప్రొఫెసర్ & హెచ్ ఓ డి, డా.దుగ్గినేని శ్రీనివాసులు ప్రొఫెసర్, డా. వి. సాయిరాం మరియు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
