NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బకాయిల మోత-విద్యార్థులకు వాత

1 min read

పేదింటి బిడ్డల ఉన్నత చదువులకు కూటమి సర్కారు గండి

 ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం

నియోజకవర్గ వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల సాయికుమార్ రెడ్డి

న్యూస్ నేడు చెన్నూరు :- రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాల దుస్థితి దినదిన గండంగా తయారైందని వైయస్సార్సీపి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల సాయి కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చెన్నూర్ లో విలేకరులతో మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుది బండగా మారిందని ఆయన కూటమి ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు.’ఫీజు రీయింబర్స్మెంట్’ బకాయిలు కొండలా పేరుకు పోవడంతో కళాశాలల మనుగడ, విద్యార్థుల భవిష్యత్తు పెను ప్రమాదంలో పడిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం సకాలంలో ‘ఫీజు చెల్లింపులు చేయక పోవడం తో యావత్ కళాశాలల ఉనికికే ప్రశ్నార్థకంగా మిగిలిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో దాదాపు రూ.4,200 కోట్లు ఫీజు రీయిం బర్స్మెంట్, రూ.2,200 కోట్లు హస్టల్ మెయిం టెరెన్స్ చార్జీలు (వసతి దీవెన) మొత్తంగా రూ.6,400 కోట్లు పెండింగ్ లో పెట్టడం దారుణమని ఆయన అన్నారు. వాస్తవానికి అధిక శాతం కళాశాలలు విద్యార్థుల ఫీజులపైనే ఆధారపడి నిర్వహణను చేపట్టడం జరుగుతుందని. సకాలంలో కూటమి ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయని ఆయన తెలిపారు. కళాశాలలో అధ్యాపకులకు, బోధ నేతర సిబ్బందికి జీతాలు చెల్లించలేక కళాశాల యాజమాన్యాలు కొట్టుమిట్టాడు తున్నాయని ఆయన అన్నారు. ఈ పరిణామాల ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదని అధునాతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా కళాశాలలు అప్ గ్రేడ్ అవలేక మూస పద్ధతిలోనే కొనసాగడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కళాశాల యాజమా న్యాలు ఉన్నప్పుడు నైపుణ్యం కలిగిన సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారని  అరకొర సిబ్బందితో బోధనను సాగించాల్సిన దయ నీయ పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులకు కోలుకో లేని నష్టం కలుగుతోందని ఆయన బాధను వ్యక్తం చేశారు. విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ కింద అందించే మొత్తాన్ని కూడా నిలిపి వేయడంతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య భారంగా మారిందని గతంలో వసతి దీవెన కింద ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసినప్పుడు కళాశాలల హాస్టల్లో విద్యార్థులు సకాలంలో చెల్లిం పులు చేసేవారని తెలిపారు. ఆ విధంగానూ కళాశాలలు ఆర్థికం గా బలంగా ఉండేవని నేడు పరిస్థితి లేక దీనస్థితిలో విద్యావ్యవస్థ ఉండడం బాధాకరమన్నారు. ఇలాంటి తరుణంలో విద్యార్థులు కళాశాల యజమానులు ప్రభుత్వ తీరుపై పోరాటానికి  సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను భ్రష్టు పట్టించిందని. పీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను తీవ్రంగా నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు.

రూ.6,400 కోట్ల బకాయిలు

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల చెల్లింపుల కింద కూటమి ప్రభుత్వం సుమారు రూ.6,400 కోట్లు బకాయిలు పెట్టింది. ఇందులో విద్యార్థుల హాస్టల్ ఖర్చుల కింద రూ.2,200 కోట్ల చెల్లింపులకు మంగళం పాడేసింది. అసలు ఎక్కడా ఆ ఊసే ఎత్తడం లేదు. కేవలం ఫీజు రీయింబర్స్మెంటిపై ఆడపాదడపా మాట్లాడుతూ.. సకాలంలో చెల్లింపులు చేసేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. కానీ, ఇప్పటికీ రూ.4.200 కోట్ల వరకు బకాయిలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలనను మొదటి నుంచి ప్రారం భిస్తామంటే చట్టాలు, రాజ్యాంగం అంగీకరించవు. అందుకే ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగిం చాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే 2014-19లో టీడీపీ హయాంలో 16.78 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1,778 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణ బాధ్యతగా బావించి చెల్లింపులు చేసింది.

బడ్జెట్లోనూ విద్యకు లోటే

ఒక విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ క్కు రూ.2,800 రోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.8,000 కోట్లు వెచ్చించాలి. కానీ, 2024-25కు నిధులు ఏమీ విదల్చక పోగా, 2025-28 విద్యా సంవత్సరానికి బడ్జెట్లో రూ.8,900 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసింది. విద్యార్థుల భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కిం ద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. టీడీపీ ప్రభుత్వ బకాయి లతో కలిపితే మొత్తం రూ.18,663.44 కోట్లు ఉన్నత విద్య కింద ఉచిత చదువులకు ఖర్చు పెట్టింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *