డిప్యూటీ తహసిల్దార్ గా ఎం. సుదర్శనం బాధ్యతలు
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: తుగ్గలి మండల రెవెన్యూ డిప్యూటీ తహసిల్దార్ గా ఎం .సుదర్శన్ బాధ్యతలు స్వీకరించారు. తుగ్గలి డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేస్తున్న నాగరాజు కోడుమూరుకు బదిలీ అయ్యారు. దీంతో పత్తికొండ ఆర్డిఓ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేస్తున్న ఎం. సుదర్శన్ ను తుగ్గలి మండలానికి రెవెన్యూ డిప్యూటీ తాసిల్దారుగా బదిలీపై వచ్చారు. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, అందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.

