దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి: టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు నగరంలో నవరాత్రులు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. సోమవారం నగరంలోని పెద్దపడఖానా, నంద్యాల గేటు, వడ్డెగేరి, జొహరాపురం, ఇందిరాగాంధీ నగర్, రాధాకృష్ణ టాకీస్, రాజీవ్ నగర్‌తో పాటు 5, 7, 50వ వార్డుల్లో దుర్గామాత విగ్రహాల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిజి భరత్ హాజరై అమ్మవారికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూల్లో ప్రతి యేడాదిలాగే ఈ సారి కూడా నవరాత్రులను ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. వచ్చే సంవత్సరం నుండి కేవలం మట్టితో చేసిన అమ్మవారి విగ్రహాలనే ఏర్పాటుచేసి పూజించాలని సూచించారు. కరోనాలాంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ప్రజలకు అంతా మంచే జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల నాయకులు, దుర్గామాత మంటపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.