ఎన్నికల కమిషన్ రద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆప్ఘన్ లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అఫ్గానిస్తాన్ ఎన్నికల కమిషన్‌ను తాలిబన్ల ప్రభుత్వం రద్దు చేసింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ఫిర్యాదుల కమిషన్‌ను రద్దు చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి బిలాల్ కరీమి వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో అఫ్గాన్‌లో ఈ వ్యవస్థలు అనవసరం. భవిష్యత్తులో అవసరమైతే వీటిని పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, శాంతి స్థాపన మంత్రిత్వ శాఖలనూ మూసివేస్తున్నట్లు బిలాల్ తెలిపారు.