బీఈవో ఆత్మహత్య.. పిస్టల్ తలపై పెట్టి !
1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటకలో తాలూకా స్థాయి విద్యాధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగర జిల్లాలోని యలహంక బ్లాక్ విద్యాధికారిఇటీవల కమలాకర్ అనారోగ్యానికి గురయ్యారు. బెంగళూరులోని ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి దగ్గర్లోని ఖాళీ స్థలంలో పిస్టల్‌తో తలపై కాల్చుకోవడంతో ప్రాణాలు వదిలాడు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

