PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన కమిటీ ఎన్నిక…

1 min read

– ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అసోసియేషన్
పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: (ఫ్లోరెన్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు గారు కర్నూల్ నగరంలోని నూతన కమిటీనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా ఏ.రాజేష్ ,ఉప అధ్యక్షులుగా ఎం.సురేంద్ర ,సెక్రటరీగా ఎన్.శివకుమార్ ,జాయింట్ సెక్రటరీగా శ్రీనివాసులు, ట్రెజరర్గా ఇమానుయెల్ , ఎగ్జిక్యూటివ్ మెంబర్సగా రవిప్రకాష్ ,వి.అనిత గారిని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు అందరూ మాట్లాడుతూ రాష్ట్రంలోనీ నర్సింగ్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికై పాటుపడతామని తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలోని ప్రైవేట్ నర్సుల సమస్యల మీద రాజీ లేని పోరాటాలకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.అనేకమంది నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ సమాజానికి ఆదర్శవంతమైన జీవితం జీవిస్తున్న ప్రైవేట్ నర్సులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో నర్సులకు ప్రత్యేక స్థానం ఇవ్వాలనివారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటల్ లో పనిచేస్తున్న నర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత అలాగే ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాల పని ఒత్తిడి నుండి మినహాయింపు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులను అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

About Author