బాల్యవివాహాల విముక్తి గోడపత్రికలను ఆవిష్కరించిన ఏలూరు ఎంపీ
1 min read

బాల్య వివాహం చట్టపరమైన నేరం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ (సి ఆర్ ఏ ఎఫ్)ఆధ్వర్యంలో బాల్యవివాహాల విముక్తురథం ఆవిష్కరించి బాల్యవివాహాల విముక్తి గోడ పత్రికలను ఎంపీ పుట్టా మహేష్ ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. బాల్యవివాహాo చట్టపరమైన నేరం, బాల్యవివాహాలు జరిపించడం తల్లిదండ్రులు కానీ, ఇతరులు కానీ దాన్ని ఎవరు ప్రోత్సహించవద్దని హితవు పలికారు. కార్యక్రమం ఐసిడిఎస్ పిడి పీ.పద్మావతి, ఉమెన్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సూర్య చక్రవేణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

