ఎమ్మెల్సీ కరీమున్నీసా ఇకలేరు !
1 min readపల్లెవెలుగు వెబ్: ఎమ్మెల్సీ ఎండీ. కరీమున్నీసా తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా ఆమె శాసనమండలి సమావేశాలకు కూడ హాజరయ్యారు. శుక్రవారం రాత్రి సీఎం జగన్ ని కలిశారు. అనంతరం ఆమె ఇంటికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం క్షీణించి, హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. ఆమె గతంలో విజయవాడ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా పనిచేశారు.