ఇన్ఫోసిస్ పై కేంద్రానికి ఉద్యోగుల ఫిర్యాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ నుంచి రాజీనామా చేసిన ఉద్యోగులందరికీ కొత్త నియమాన్ని విధించింది. రాజీనామా చేసిన ఉద్యోగులు ఆరు నెలల పాటు ఇన్ఫోసిస్‌తో సమానమైన టీసీఎస్, యాక్సెంచర్, ఐబీఎం, కాగ్నిజెంట్, విప్రో లాంటి పేరున్న కంపెనీల్లో పనిచేయకూడదని ఉద్యోగులకు ఇన్ఫోసిస్ కొత్త నిబంధనను తెచ్చింది. న్ఫోసిస్ తెచ్చిన కొత్త నిబంధనపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రం తలుపుతట్టింది. ఇన్ఫోసిస్ నిర్ణయంపై కార్మిక మంత్రిత్వశాఖకు ప్రముఖ ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(NITES) ఫిర్యాదు చేసింది.ఇన్ఫోసిస్ తెచ్చిన క్రూర నిబంధనపై సమీక్షించాలని కేంద్రాన్ని కోరింది.